Friday 13 August 2010

శ్రీదేవికి జన్మదిన శుభాకాంక్షలు!


ఐదేళ్ళ ప్రాయంలోనే సినీరంగ ప్రవేశం చేసిన శ్రీదేవి 13 ఆగస్టు 1963లో మద్రాసులో జన్మించారు. తొమ్మిది సంవతసరాల వయసులో ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో చేసిన ‘బడిపంతులు’ చిత్రంలో ఎన్టీఆర్‌కి మనవరాలిగా నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా అనేక చిత్రాల్లో నటించింది. తన పదిహేనవ ఏట భారతీరాజా రూపొందించిన ‘పదునారు వయనిదిలై’ చిత్రంతో హీరోయిన్‌గా ప్రవేశించింది శ్రీదేవి. అదే చిత్రాన్ని తెలుగులో కె. రాఘవేంద్రరావు ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో రూపొందించారు. ఎన్టీఆర్‌తో నటించిన ‘వేటగాడు’ చిత్రంలో ‘‘ఆకుచాటు పిందె తడిసె...’ అంటూ వానలో తడిసిన అందాలతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. అప్పట్నుంచే ఆమె శృంగార దేవతగా అభిమనుల హృదయాల్లో గూడు కట్టుకుంది. ఎన్టీఆర్‌, అక్కినేని, కృష్ణ, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వంటి అగ్రనటులతో కలిసి నటించి ప్రతి ఒక్కరి సరసన పర్‌ఫెక్ట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ అందాల డ్రీమ్‌ గర్ల్‌ పుట్టినరోజు సందర్భంగా tv5ఆమెకు శుభాకాంక్షలు అందిస్తోంది.

www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

No comments:

Post a Comment