Wednesday 18 August 2010

సోనీ మాయ...

ఇండియన్ ఐడల్‌గా శ్రీరాం ఎన్నికవ్వడమేమోగానీ, ఎస్‌ఎంఎస్‌ల గురించి మళ్లీ వివాదం మొదలయ్యింది. ప్రతీ ప్రోగ్రాంకు ఎస్సెమ్మెలు పంపించడంటూ రిక్వెస్ట్ చేయడం కామన్ అయిపోయింది. కొన్ని ప్రోగ్రాంలకైతే.. ఎస్సెమ్మెస్ ద్వారా విజేతలనూ నిర్ణయిస్తున్నారు. చెప్పుకుంటూ వెళితే ఇదంతా పెద్ద డిస్కషన్ కూడా అవుతుంది. ఎందుకంటే తెలుగులో వచ్చే ప్రోగ్రాంలన్నీ ఎస్సెమ్మెస్‌లతోనే నడుస్తున్నాయి. ఇక శ్రీరాం చంద్ర విషయానికి వద్దాం. సోనీలో టెలికాస్ట్ అయిన ఫైనల్స్ లైవ్ కవరేజ్‌లా కనిపించలేదు. కానీ,
ఆగస్టు 15న గ్రాండ్ ఫినాలే అంటూ సోనీ టెలివిజన్ హడావిడి చేసింది. గెస్ట్‌లుగా అమితాబ్, కరీనా సహా ఎంతోమంది వీఐపీలు రావడం, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉండడం, అంతా చూస్తే అది లైవ్‌కవరేజ్‌లానే లేదు. (సోనీ కూడా బగ్ వేసుకోలేదనుకోండి). ఇక్కడే అసలు తిరకాసు ఉంది. ప్రోగ్రాంను చూస్తే దాదాపు రెండు మూడు రోజుల ముందే షూటింగ్ అయిపోయినట్లు కనిపించింది. కానీ, ఎస్‌ఎంఎస్‌లు మాత్రం ఆగస్టు 15 రాత్రి 8 గంటల వరకూ ఎస్‌ఎంఎస్‌లను అడిగింది. అంటే శ్రీరామ్‌కు అవార్డు ఇచ్చేసిన తర్వాత కూడా జనాన్ని దోచుకోవడానికి ఎస్‌ఎంఎస్‌లను స్వీకరించిందన్నమాట. ఎంత మోసం..

ఇక్కడ మరో విషయాన్ని చెప్పుకోవాలి. సోనీ ప్రోగ్రాం ఇలా అయ్యిందో లేదో.. అలా సాక్షికోసం ముంబై నుంచి లైవ్‌లో కనిపించాడు శ్రీరామ్. సాధారణ పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా.. శ్రీరాంను గెలిపించొద్దా అన్న అనుమానం మీకు రావచ్చు. నేను ప్రశ్నించేది ఛానల్ తీరు గురించి.. జనాన్ని మోసం చేయడం గురించి. మీరేమంటారు..?



Source:24gantalu

www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

No comments:

Post a Comment