“ప్రిన్స్” మహేష్ బాబు ని ఇప్పుడు మనం “కింగ్ ఆఫ్ బ్రాండ్స్” అని పిలవచ్చు. ప్రస్తుతం “థమ్స్ అప్”, “యూనివర్ ‘సెల్’” మరియు “నవరతన్ ఆయిల్” కి మహేష్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. ఇప్పుడా జాబితాలోకి మరో రెండు కంపెనీలు వచ్చి చేరబోతున్నాయి. తాజాగా “అమృటాంజన్” మరియు “ప్రొవోగ్” కంపెనీలు తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్ గా ఏరి కోరి మహేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇవే కాకుండా మరికొన్ని కంపెనీలు మహేష్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం తన ఖాతాలో ఉన్న ఒప్పందాలతో, ఇదే ఫీల్డులో ఉన్న ఇతర సినీ హీరోలు నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ల కంటే ఒక అడుగు ముందే ఉన్నాడు మహేష్. తీరిక సమయాల్లో కాలక్షేపానికి ఇలాంటివి చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఇక ఇతర హీరోలు కూడా ఆలోచిస్తారు అనడంలో సందేహం లేదు… ఏమంటారు?
No comments:
Post a Comment