అయోధ్యలోని బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతం రామజన్మభూమేనని అలహాబాద్ హైకోర్టులోని లక్నోబెంచ్ సంచలన తీర్పు చెప్పింది. ఈ విషయంలో బెంచ్‌లోని ముగ్గురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, భూమిపై యాజమాన్య హక్కుల విషయంలో మాత్రం న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ కేసులో దాఖలైన నాలుగు కేసుల్లో రెండింటిని కొట్టివేసి.. మరో రెండింటిపై న్యాయమూర్తులు తుదితీర్పును చెప్పారు. దీంతో స్థలంపై పూర్తి హక్కులు తనవేనని ముస్లిం వక్ఫ్ బోర్డ్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. వివాదాస్పద ప్రాంతాన్ని మూడుభాగాలుగా విభజించిన హైకోర్టు, రామ్‌లాలా ప్రాంతాన్ని హిందువులకు ఇవ్వాలని తీర్పు తెచ్చింది. బయటి ప్రాంతాన్ని ముస్లింలకు ఇవ్వాలని సూచించింది. మూడో ప్రాంతాన్ని మాత్రం నిర్మోహి అఖాడాకు కేటాయించింది. ఈ తీర్పుపై అప్పీలుకు మూడు నెలల గడువును అలహాబాద్ హైకోర్టు ఇచ్చింది.
No comments:
Post a Comment